ఆహా అనిపించిన 'సెలెస్ట-2020 యూత్ ఫెస్టివల్' - చిత్తూరులో కళాంజలి ఫ్యాషన్ షో
చిత్తూరు ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన 'సెలెస్ట-2020 యూత్ ఫెస్టివల్' అందరినీ ఆకట్టుకుంది. కళాంజలి వస్త్రదుకాణం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో లో వివిధ రకాల దుస్తులు ధరించిన యువతీయువకులు ర్యాంప్ వాక్ చేసి అలరించారు. కంచిపట్టు చీర, సల్వార్ సూట్, బ్లేజర్, చుడిదార్లు, షేర్వాణీ ధరించి ఆహూతుల్ని ఆకట్టుకున్నారు. సంప్రదాయ, ఆధునిక యువత మెచ్చేలా ఫ్యాషన్ షో సాగింది.