మిషన్ కర్మయోగి: పర్యవేక్షణే కాదు.. విస్తరణ కూడా జరగాలి! - రజ తోూాేూ లాైే
మిషన్ కర్మయోగి పేరిట కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సమర్థతను మదింపు వేసే పథకం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం.. ఈ కొత్త వ్యవస్థకు ఇప్పటికే ఆమోదముద్ర కూడా వేసింది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని స్థాయిల ఉద్యోగుల సామర్థ్యం ఎప్పటికప్పుడు పెరగడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది మోదీ సర్కార్. ఇందుకోసం ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేయనున్నారు. అయితే.. ఇది కేవలం ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోకుండా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని అంటున్నారు... లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ. నిరంతరం ఈ ప్రక్రియను పర్యవేక్షించటమే కాక... రాష్ట్రాలకూ విస్తరించాలంటున్న జయప్రకాశ్ నారాయణతో ఈటీవీ భారత్ ముఖాముఖి.