జనగణమన గీతం.. జపనీయుల శ్రావ్యమైన సంగీతం..! - జనగణమనకు సంగీతం జోడించిన జపనీయుల వార్తలు
జనగణమన.. ఈ గీతం వింటే ప్రతీ భారతీయునిలో దేశభక్తి ఉప్పొంగుతుంది. భారతదేశ 74వ స్వాంతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జపాన్ టోక్యోకు చెందిన మాకిన్ సూపర్ బ్యాండ్ పార్టీ భారతదేశ జాతీయ గీతానికి మధురమైన సంగీతాన్ని జోడించింది. భారతదేశంపై ఉన్న గౌరవం, అమితమైన ఇష్టంతో అంకితం చేసినట్లు వెల్లడించింది. 'ప్రియమైన భారతదేశమా.. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.. గౌరవిస్తున్నాం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీ జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తున్నాం.' అంటూ భారతదేశంపై తమ దేశభక్తిని చాటారు. ఆ సంగీతం వీడియోను మీ కోసం..!