ప్రతిధ్వని: పతనమవుతోన్న వృద్ధి రేటు... ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం - Etv Bharat Pratidwani latest News
కొవిడ్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.6 శాతం మేర తగ్గనుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. కరోనా సంక్షోభానికి అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లాక్డౌన్ భారత్లోనే అమలు చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 14 శాతం పెరిగే ప్రమాదముందని ఆర్బీఐ మాజీ గవర్నర్ సి.రంగరాజన్ అన్నారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో పడింది..? ఆర్థిక వ్యవస్థ కోలుకోడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటీ ? ఏఏ రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముంది. ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.