శివుని పాదాలు తాకుతూ... పరవళ్లు తొక్కుతూ... - uka chettu vaagu
వనపర్తి జిల్లా మదనాపురం మండలం పామాపురం వద్ద పది అడుగుల ఎత్తులో ప్రవహిస్తున్న ఊక చెట్టు వాగు కనువిందు చేస్తోంది. భ్రమరాంబ సమేత రామేశ్వరాలయం అనుబంధంగా వాగులో నిర్మించిన 36 అడుగుల శివుని విగ్రహాన్ని తాకుతూ నీటి ప్రవాహం వేగంగా ముందుకు సాగుతోంది. దశాబ్ద కాలంలో ఇంతటి భారీ వరదలు రావడం ఇదే మొదటిసారి కావటం వల్ల వాగు పరవళ్లు చూసేందుకు ప్రజలు పోటెత్తున్నారు.