'ఫ్యాషన్ యాత్రతో పేదచిన్నారులకు విద్య' - fashion yatra for a cause
దశాబ్దకాలంగా హైదరాబాద్ ఫ్యాషన్ ప్రియులను రకరకాల డిజైన్లతో కనువిందు చేస్తూ.. పేద విద్యార్థినులకు విద్యను అందిస్తున్న ఫ్యాషన్ యాత్ర మరోమారు అందుబాటులోకి వచ్చింది. నగరంలోని తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన 'ఫ్యాషన్ యాత్ర ఫర్ ఏ కాజ్'ను టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ చిన్నారులు ప్రారంభించారు. ప్రదర్శనలో వివిధ రకాల ఆభరణాలతో పాటు.. దీపావళికి కుటుంబసమేతంగా కొనుగోలు చేసేలా వస్త్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు నిర్వాహకురాలు కామినీ సరాఫ్ తెలిపారు. ఈ ఫ్యాషన్ యాత్ర ద్వారా వచ్చిన డబ్బును టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థకు అందజేసి.. తద్వారా ఆడపిల్లల చదువుని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు.