ప్రతిధ్వని: సామాన్యుడి ఆరోగ్యానికి భరోసా ఎలా? - భారత్ డిబేట్
కరోనా తెచ్చిన సంక్షోభంతో దేశంలో ప్రజారోగ్య రంగం ఊహించని సవాళ్లు ఎదుర్కొంటోంది. రోగ నిర్ధరణ నుంచి.. చికిత్స... ఔషధాల వరకు గతంలో ఎప్పుడూ చూడని గడ్డు పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో సామాన్యుడి ఆరోగ్యానికి భరోసా ఎలా? దేశ ప్రజారోగ్య రంగాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఎలా? కరోనా వంటి మహమ్మారులు ప్రబలిన సమయంలో ఎలాంటి కార్యాచరణ అవసరం? ఈ విషయాలపై కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది నీతి ఆయోగ్. టెలీ మెడిసిన్‌తోపాటు స్థానిక అవసరాలకు... స్థానికంగానే పరిష్కారం, నిధుల లభ్యత అంశాలపై దిశానిర్దేశం చేసింది. ఈ నివేదికలోని అంశాలపై ప్రతిధ్వని చర్చ.