ప్రతిధ్వని: జీఎస్టీ పరిహారంపై కేంద్రం వైఖరి.. రాష్ట్రాల ఆందోళన
జీఎస్టీ 41వ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే పరిహారంపై వాడీ వేడీగా చర్చ కొనసాగింది. కేంద్రం తక్షణమే పరిహారం చెల్లించాలని.. ఎన్డీయేతర పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాల ముందు రెండు ఐచ్ఛికాలను ఉంచింది. మొదటిది.. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రుణం తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వడం.. రెండోది రెవెన్యూ లోటు 3 లక్షల కోట్ల రూపాయలను రాష్ట్రాల పేరుతో జీఎస్టీ మండలి రుణంగా తీసుకుని వడ్డీతో సహా చెల్లించడం. వీటిలో ఏదో ఒక ఐచ్ఛికాన్ని రాష్ట్రాలు ఎంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిహారంపై కేంద్ర వైఖరి.. రాష్ట్రాల ఆందోళనలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.