ప్రతిధ్వని: ఆంక్షలతో కట్టడి కష్టమేనా..? లాక్‌డౌన్ తప్పదా..? - భారత్ డిబేట్
లాక్‌డౌన్. ఇప్పుడు దేశం మొత్తం ఇదే అంశంపై చర్చ. విరుచుకుపడుతున్న కరోనా సెకండ్ వేవ్ కట్టడికి అంతకు మించిన మరో మార్గం లేదంటున్నారు నిపుణులు. కానీ... గతేడాది చేదు అనుభవాల నేపథ్యంలో ఆ మాట వింటేనే ఉలిక్కి పడుతున్నాయి... ఉద్యోగ, వ్యాపార వర్గాలు. వలసకూలీల పరిస్థితి మరీ దయనీయం. ప్రభుత్వాలైతే లాక్‌డౌన్ ఆఖరి అస్త్రమే అని చెబుతున్నాయి. కానీ.. అప్పటి వరకు ఆగేలా లేవు పరిస్థితులు. పెరుగుతున్న కేసులు, మరణాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఆంక్షలు, పాక్షిక లాక్‌డౌన్‌లతో పాటు.. కొన్నిచోట్ల సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్త లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదా? ఆంక్షల వ్యూహాలు ఎలా ఉండాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.