ప్రతిధ్వని: ప్రభుత్వ రుసుములతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స సాధ్యం కాదా..? - ప్రతిధ్వని వీడియోలు
తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక ప్రైవేటు ఆస్పత్రులు కరోనా చికిత్సకు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. మెరుగైన చికిత్స లభిస్తుందనే ఆశతో, ప్రజలు అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రైవేటు దవాఖానాల్లో కొవిడ్ చికిత్సకు ఫీజులు నిర్ధారించాయి. ఖరీదైన మందులు, నిర్ధారణ పరీక్షలు, పీపీఈ కిట్లకు మినహాయింపులు ఇచ్చాయి. అయినా ప్రైవేటు ఆస్పత్రులు రోజుకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు దండుకుంటున్నాయి. నిర్ధారణ పరీక్షల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నాయి. కరోనా చికిత్సల్లో కొన్ని పైవేటు ఆస్పత్రుల దోపిడీపై ప్రతిధ్వని చర్చ.