ప్రతిధ్వని: మృత్యుఘోషకు పాలనా వ్యవస్థల వైఫల్యమే కారణమా? - భారత్లో కరోనా ప్రభావం
కన్నీళ్లు ఇంకిపోతున్న శోకం.. తల్లులు - బిడ్డలూ కడసారి చూపులకు నోచుకోలేని దైన్యం.. కరోనా ప్రమాదాన్ని అంచనా వేయడంలో అజాగ్రత్తగా వ్యవహరించిన పాలనా వ్యవస్థల వైఫల్యానికి ప్రతిఫలం. ఆగమేఘాల మీద విమానాలతో ఆక్సిజన్ కంటెయినర్లు దిగుమతి చేస్తున్నా.. ప్రజల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. లక్షల డోసుల టీకాలు పంపిణీ చేస్తున్నా... కొవిడ్ పడగ విస్తరిస్తూనే ఉంది. కరోనా ఊహించని ఉత్పాతమే అయినా.. ఆపత్కాలంలో ఆదుకోలేనంత అధ్వానంగా.. వైద్య, ఆరోగ్య వ్యవస్థ ఎందుకు తయారైంది? ప్రపంచస్థాయి ప్రమాణాలున్న ఆసుపత్రుల్లో సైతం నమ్మకమైన వైద్యం ఎందుకు అందడంలేదు? ఈ అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.