తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: కేంద్రం సంస్కరణలు... ఏమేరకు పెట్టుబడులను తీసుకొస్తాయో..! - ఈటీవీ ప్రతిధ్వని

By

Published : Jul 10, 2020, 9:46 PM IST

పెట్టుబడులు పెట్టేందుకు భారత్ అత్యంత అనుకూల దేశమని... అంతర్జాతీయ కంపెనీలకు ఎర్రతివాచి పరుస్తున్నామని.. ఇండియా గ్లోబల్​ వీక్​ 2020లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్​ నినాదం ప్రపంచానికి దూరం కావడానికి కాదని.. సొంతంగా వృద్ధి సాధించడానికి మాత్రమేనని స్పష్టం చేశారు. భారత్​లో వ్యవసాయం, రక్షణ, అంతరిక్ష సహా పలు రంగాల్లో పెట్టుబడులకు భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. కరోనా సంక్షాభాన్ని అధిగమిస్తామని.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్​ కీలక పాత్ర పోషించబోతోందని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు భారత్​ ఎంత అనుకూలంగా ఉంది?, ఏఏ రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అవకాశం ఉంది.. మోదీ సర్కారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ఏమేరకు పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంశాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details