PRATHIDWANI: కృష్ణానది కాలుష్యం కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రేంటి?
కృష్ణా నదిలో నీటి కాలుష్యం పెరిగింది. ప్రతి రోజూ గ్రామాలు, పట్టణాలు నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థాలతో నది నీటిలో హానికారక బ్యాక్టీరియా స్థాయి పెరుగుతోంది. ఇప్పుడీ నీటిని నేరుగా తాగలేం. క్లోరినేషన్ ప్రక్రియతో శుద్ధిచేసిన తర్వాతే ఈ నీటిని తాగునీటి అవసరాలకు వాడాల్సి ఉంటుంది. నదీలో చేరుతున్న కాలుష్య కారకాలను కట్టడి చేసి, జలాలను కాపాడుకునే దిశగా వడివడిగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అసలు కృష్ణానదిని కలుషితం చేస్తున్న కారకాలు ఏంటి? వాటి కట్టడిలో ప్రభుత్వాలపై ఉన్న బాధ్యతలేంటి? పౌర సమాజం పాత్ర ఎలా ఉండాలి? ఇదే అశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.