Prathidwani: పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేరేది ఎలా? - ఇళ్ల ధరలకు రెక్కలు
దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ముడి సరుకుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో అనివార్యంగా ఇరవై నుంచి ముఫ్పై శాతం ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంటుందని క్రెడాయి అంచనా వేసింది. కరోనా సంక్షోభ సమయంలో తగ్గిన వడ్డీరేట్లు, ఆన్‌లైన్ విక్రయాలు గృహ మార్కెట్‌కు కొంత వరకు ఊతంగా నిలిచాయి. నిర్మాణ రంగంలో పెరిగిన ధరల భారాన్ని భరించేందుకు ఇన్వెస్టర్లు, బిల్డర్లు కో వర్కింగ్, కో లివింగ్ పద్ధతుల్లో ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతి గృహ యజమానుల సొంతింటి నిర్మాణం కల సాఫీగా ముందుకు సాగేది ఎలా? పెరిగిన ధరలను, నిర్మాణ వ్యయాలను భరించడం ఎలా? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని.