ప్రతిధ్వని: సేద్య చట్టాలతో రైతులకు మేలెంత? కీడెంత? - వ్యవసాయ బిల్లులపై ప్రతిధ్వని
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కొత్త చట్టాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలతోపాటు విస్తృతమైన చర్చ జరుగుతోంది. సేద్య చట్టాలు రైతుల జీవితాల్లో సమూలమైన మార్పులు తెస్తాయని మోదీ ప్రభుత్వం ఘంటాపథంగా చెబుతోంది. అయితే చట్టం రైతుల పాలిట మరణశాసనాలుగా విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకా ఈ చట్టాల విషయంలో రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రైతు సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈ చట్టాలపై మేధావుల్లోనూ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏది నిజం? ఎవరి వాదన సమర్థనీయం? నిజంగా కొత్త చట్టాలతో రైతులకు జరిగే మేలెంత? కీడెంత?.. ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది.
Last Updated : Sep 28, 2020, 10:07 PM IST