ప్రతిధ్వని: కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతిష్ఠ ఎందుకు మసకబారుతోంది? - cbi latest news
అవినీతి, అక్రమాలపై కొరడా ఝళిపించే పాశపతాస్త్రాలు కేంద్ర దర్యాప్తు సంస్థలు. రోజురోజుకూ అవి కొందరి చేతిలో కీలుబొమ్మలు అవుతున్నాయంటూ విమర్శలు చెలరేగుతున్నాయి. నిజాలు నిగ్గుతేల్చాల్సిన అత్యున్నత సంస్థల పనితీరును రాజకీయ పార్టీలు, కోర్టులు అనుమానిస్తున్న సందర్భాలూ చూస్తున్నాం. నేరాలు, ఘోరాలపై నిజాయతీగా సత్యశోధన చేయాల్సిన దర్యాప్తు సంస్థలపై ఈ సందేహాలెందుకు? రాజ్యాంగ పరిధిలో స్వేచ్ఛగా పని చేయాల్సిన సంస్థల ప్రతిష్ఠ ఎందుకు మసకబారుతోంది? ఈ అశంపై ప్రతిధ్వని చర్చ.