PRATHIDWANI: స.హ చట్టం ఎందుకు నీరుగారుతోంది? ఆర్టీఐ సాధించిన విజయాలేంటి? - ఆర్టీఐపై ప్రతిధ్వని
etv bharat prathidwani:పరిపాలనలో పారదర్శకతకు సులువైన మార్గం సమాచార హక్కు చట్టం. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన ఈ చట్టం స్ఫూర్తి... ఆచరణలో ప్రభుత్వాల ఉదాసీనత వల్ల నీరుగారిపోతోంది. కోరిన సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం, దరఖాస్తులు తిరస్కరించే ధోరణితో చట్టం ఉద్దేశ్యం మసక బారుతోంది. పరిపాలనలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన జీఓలను సైతం రహస్యంగా దాచిపెడుతున్న దుస్థితి. పై అధికారుల అనుమతి లేనిదే సమాచారం ఇవ్వొదన్న ఆదేశాలు... ప్రభుత్వాల దాపరికాల్ని బహిర్గతం చేశాయి. కోర్టులు కల్పించుకుని మందలించే దాకా పరిస్థితి వచ్చింది. ఆర్టీఐ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులు, దాడులు, హత్యల ఘటనలు సమస్య తీవ్రతకు నిదర్శనాలు. ఈ నేపథ్యంలో సమాచార హక్కు చట్టం స్ఫూర్తి ఎందుకు నీరుగారుతోంది? ఆర్టీఐ సాధించిన విజయాలేంటి? విజిల్ బ్లోయర్స్‌కు రక్షణ కల్పించడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.