Prathidhwani: మోదీ- బైడెన్ భేటీ.. క్వాడ్ కూటమిలో భారత్ భాగస్వామ్యం ఎలా ఉంటుంది? - ఈటీవీ భారత్ ప్రతిధ్వని
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం ప్రధానమంత్రి మోదీ అమెరికా వెళ్లారు. అఫ్గాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన కీలక పరిస్థితుల్లో మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అఫ్గాన్ విషయంలో చైనా, పాక్ జట్టుగా ఏర్పడి ఇరాన్, రష్యాల మద్దతు సాధిస్తున్నాయి. ఇదే సమయంలో భారత్ కళ్లతో అఫ్గాన్‌ను చూడలేమని అమెరికా తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో తాలిబన్ల నుంచి కశ్మీర్‌కు ముప్పు ఉంటుందన్న అనుమానాలు పెరిగాయి. అకాస్ ఏర్పాటుతో క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర ఎలా ఉండాలన్న అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అమెరికా పర్యటనలో వీటన్నింటికీ మోదీ ఎలాంటి పరిష్కారం సాధిస్తారన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటనపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.