Prathidwani: ధాన్యం కొనుగోళ్లపై పరిమితి.. అన్నదాతకు తప్పని దుస్థితి..!
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్కు తరలుతోంది. ఐకేపీ కేంద్రాలు, రైస్ మిల్లులు, మార్కెట్ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అకాల వర్షాల భయంతో రైతులు ముందస్తుగా వరి కోతలు చేపట్టడంతో ఇప్పటికే భారీస్థాయిలో పంట చేతికొచ్చింది. ఈ ధాన్యం ట్రాక్టర్లు ఇప్పుడు మార్కెట్ యార్డుల వద్ద బారులు తీరుతున్నాయి. కొనుగోళ్ల లక్ష్యానికి ప్రభుత్వం పరిమితి విధించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ధాన్యం తరలింపు ఆలస్యమైతే పండించిన పంట అమ్ముకోలేమన్న భయం తీవ్రమైంది. ఈ నేపథ్యంలో వేలాది ధాన్యం ట్రాక్టర్లతో రోడ్డెక్కుతున్న రైతులకు ప్రభుత్వాలు భరోసా కల్పిస్తాయా? కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ఎలా జరుగుతోంది? రైతులకు కనీస మద్దతు ధర దక్కుతోందా? ఇదే అంశంపై ఈరోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం చేపట్టింది.
Last Updated : Nov 4, 2021, 10:24 PM IST