prathidhwani: వ్యాక్సిన్‌లో భారత్ సరికొత్త రికార్డ్.. స్వల్పకాలంలోనే 100 కోట్ల టీకాల పంపిణీ - ప్రతిధ్వని చర్చా
నవ చరిత్రను లిఖించాం! దేశవ్యాప్తంగా సాగుతున్న కొవిడ్ టీకా కార్యక్రమం 100 కోట్ల డోసుల మైలురాయి దాటిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్న మాట ఇది. ఇందులో ఎక్కడా అతిశయోక్తి కూడా లేదు. దిక్కుతోచని స్థితి నుంచి అతి స్వల్పకాలంలోనే ఇంతవేగంగా, ఇంత భారీస్థాయిలో టీకాలు అందించడం ఎలా సాధ్యపడింది? ఈ క్రమంలో ఎదురైన ఒడుదొడుకులు ఏమిటి? ఈ డిసెంబర్‌లోపు దేశం మొత్తానికి వ్యాక్సినేషన్ పూర్తి చేయగలమా? ప్రపంచాన్ని అష్ట దిగ్భంధనం చేసిన కరోనా మహమ్మారిపై విజయానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నాము. ఇదే అంశంపై నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.