ప్రతిధ్వని: దా'రుణ' యాప్‌ల వెనుకుంది ఎవరు...? - etv debate program
🎬 Watch Now: Feature Video
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాల్ మనీ యాప్‌ల దారుణాలు మితిమీరిపోయాయి. ఆన్లైన్లో సులభంగా రుణాలు ఇస్తూ... ఆ తర్వాత వడ్డీ మీద వడ్డీలు వసూలు చేస్తూ... రుణ గ్రహీతలను వేధిస్తున్న ఘటనలు ఇటీవల బాగా పెరిగాయి. ఈ వేధింపులు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. దీంతో రిజిస్టర్డ్ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. భారతీయుల్ని సంస్థ డైరెక్టర్లుగా నియమించి తెర వెనుక నుంచి చైనా ముఠాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి కాల్ మనీ యాప్‌ల దారుణాలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ...