తెలంగాణ

telangana

ETV Bharat / videos

prathidhwani: ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ లక్ష్యం ఏంటి? దాని పాత్ర ఎలా ఉంటుంది?

By

Published : Sep 28, 2021, 10:57 PM IST

దేశవ్యాప్తంగా డిజిటల్‌ విధానంలో ఆరోగ్య సేవలు అందించే ఆయుష్మాన్ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డు ఇవ్వడం.. ప్రజల ఆరోగ్య డేటాను ఆన్‌లైన్‌ వేదికగా అందుబాటులోకి తేవడం ఈ మిషన్‌ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. వైద్య నిపుణులు, ఆసుపత్రులు, వైద్యారోగ్య పరిశోధన సంస్థలను ఈ మిషన్‌లో భాగస్వామ్యం చేయనుంది ప్రభుత్వం. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఆరోగ్య వివరాలను ఇందులో పొందుపరచవచ్చు. అవసరమైనప్పుడు తమ ఆరోగ్య డేటాను ఎక్కడ నుంచైనా ఆన్‌లైన్‌ ద్వారా పరిశీలించుకునే అవకాశం కూడా డిజిటల్‌ మిషన్‌తో అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్య సేవల రంగంలో సరికొత్త సాధనం ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌తో కలిగే ప్రయోజనాలపై ఈరోజు ఈటీవీ భారత్​ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం చేపట్టింది.

ABOUT THE AUTHOR

...view details