ప్రతిధ్వని: ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వ బ్యాంకులు - దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ
దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ.. బ్యాంకుల విలీనంపై ఆర్బీఐ మాజీ గవర్నర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఒక దశాబ్దం లోపు ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఒకేసారి కాకపోయినప్పటికీ.. ప్రయోగాత్మకంగా ఒకటి, రెండూ బ్యాంకుల్ని ప్రైవేటీకరించి చూడాలి. ఎస్బీఐతో పాటుగా.. మరికొన్ని బ్యాంకులు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి ఇది సమయం కాదన్న అభిప్రాయాల్ని వారు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆవశ్యకతపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.