ప్రతిధ్వని: అమెరికా అధ్యక్ష ఎన్నికలు - బైడెన్‌దే పీఠం - ప్రతిధ్వని
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్.. వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అనే తేడా లేకుండా.. దేశం మొత్తాన్నీ ఏకతాటిపై నడిపిస్తానని బైడెన్ ప్రకటించారు. ప్రపంచానికి ఓ దివిటీలా అమెరికా దారి చూపుతుందన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం తన ముందున్న ప్రధాన కర్తవ్యంగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా.. బైడెన్ గెలవడానికి కలసివచ్చిన ప్రధాన అంశాలేమిటి? బైడెన్ ముందున్న సవాళ్లేమిటి? ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నిటినీ ఉపసంహరించుకుంటారా? భారత్‌తో బైడెన్ ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు? ఈ అంశాలపై.. ప్రతిధ్వని చర్చ.