ప్రతిధ్వని: నేర చరిత్రలో ప్రజాప్రతినిధులు.. సుప్రీం కీలక ఆదేశాలు - News today Prathidwani
దేశవ్యాప్తంగా తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,442 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ అఫిడఫిట్ సమర్పించారు. తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న 263 కేసుల్లో అత్యధికంగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలే నిందితులుగా ఉన్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించాలని అంశంపై ఆరువారాల్లోగా తమ వైఖరిని వెల్లడించాలని కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, క్రిమినల్ కేసులపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ...
Last Updated : Sep 10, 2020, 9:57 PM IST