మహిళా దినోత్సంలో క్యాన్సర్‌పై అవగాహన - swathi lakhra
మహిళా దినోత్సవం పురస్కరించుకొని వనితల ఆరోగ్యం, సాధికారతలపై హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యూర్ ఫౌండేషన్, అపోలో క్యాన్సర్ ఆధ్వర్యంలో తాజ్‌కృష్ణలో నిర్వహించారు. షీ టీంలో 90 శాతం మంది పురుషులే ఉన్నారని, స్త్రీలను రక్షించడంలో వారు ముందుంటారని కార్యక్రమంలో పాల్గొన్న ఐజీ స్వాతి లక్రా అన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.