శివసత్తుల పూనకాలతో హోరెత్తిన ఉజ్జయినీ - బోనాలు
డప్పు చప్పుళ్లు, పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి ప్రముఖులు, భక్తులు పోటెత్తారు. ఇప్పటి వరకు దాదాపు 50 వేల మంది భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు మహంకాళి తల్లీ దర్శనానికి బారులు తీరారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగర సీపీ అంజనీకుమార్ పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు.
Last Updated : Jul 21, 2019, 4:02 PM IST