సుమధుర గానం... మైమరిపించే నాట్యం - భరతనాట్యం
మంగళంపల్లి బాలమురళీకృష్ణ రాగమాలికకు అంతే లయబద్ధంగా నాట్యం చేస్తూ కళాప్రియులకు కనువిందు చేశారు ప్రముఖ నర్తకీమణి స్మితామాధవ్ శిష్యురాలు సహస్రారెడ్డి. వర్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవెందర్రెడ్డి పాల్గొన్నారు. అన్నమాచార్య సంకీర్తనలను లయబద్ధమైన భరతనాట్యంతో అలరిస్తూ వీక్షకుల కరతాళధ్వనులు అందుకున్నారు సహస్రారెడ్డి.