Bathukamma 2021: బ్యాంక్ ముంగిట్లో.. బతుకమ్మ సంబురం - telangana varthalu
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ సంబురాల(bathukamma celebrations)ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళా అధికారులు, ఉద్యోగులు హైదరాబాద్లో ఘనంగా జరుపుకున్నారు. కోఠిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం ముందు జరిగిన ఈ వేడుకల్లో యూనియన్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన నిర్వహణాధికారి కబీర్ భట్టాచార్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా పేర్చి.. సంప్రదాయబద్ధంగా చీరలు కట్టి మహిళా ఉద్యోగులు సంబురాలు(bathukamma celebrations) జరుపుకున్నారు. బతుకమ్మ ప్రత్యేక పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పువ్వులను పూజించే పండుగ అయిన బతుకమ్మను కేవలం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు వైభవంగా నిర్వహించుకుంటారని యూనియన్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన నిర్వహణాధికారి కబీర్ భట్టాచార్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ , దసరా శుభాకాంక్షలు తెలిపారు.