ప్రగతి భవన్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు - ప్రగతి భవన్లో బతుకమ్మ సంబురాలు
ప్రగతి భవన్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి సత్యవతి రాథోడ్, కేటీఆర్ సతీమణి శైలిమ, మాజీ ఎంపీ కవిత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, హరిప్రియ, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. తెరాస మహిళా ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.