అమరావతి: విభిన్న నిరసనలతో.. రాజధాని రణభేరి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ.. రైతులు, మహిళలు, యువత చేస్తున్న పోరాటం.. 250వ రోజు మరింత విభిన్నంగా.. వినూత్నంగా సాగింది. తమ ఆకాంక్షలను మరోసారి ప్రపంచానికి చాటేందుకు అన్ని వర్గాల ప్రజలు.. తమకు వీలైన రీతుల్లో ప్రదర్శనలు చేశారు. డప్పు కొట్టారు... ముగ్గులు వేశారు... చప్పట్లు కొట్టారు... గడ్డం గీశారు... ట్రాక్టరు తోలారు. రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లోని రైతులంతా ఇలా.. రకరకాలుగా నిరసనలు చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు.