తెలంగాణ

telangana

ETV Bharat / videos

Prathidwani: ప్రభుత్వబడుల్లో ఆంగ్ల మాధ్యమం... ఆచరణ ఎలా? - ts govt english medium

By

Published : Jan 18, 2022, 9:37 PM IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమలు చేయాలని.. అందుకు సంబంధించి... విధి విధానాలు ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ మార్పు అనివార్యం అంటోంది... సర్కార్. కార్పొరేట్‌ విద్యకు దీటుగా ప్రభుత్వ బడుల్ని తీర్చిదిద్దడానికి ఇంతకు మించి మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసింది రాష్ట్ర మంత్రిమండలి. ఈ పరిణామాల్ని ఎలా చూడాలి? పిల్లల భవిష్యత్ రీత్యా ఇది తప్పనిసరి అంటున్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించే వారితో పాటే... విబేధిస్తున్న వారి అభ్యంతరాలు ఏమిటి? విద్యా వ్యవస్థలో తలపెట్టిన మార్పులు ఎలా ఉంటే అందరికీ మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details