బౌండరీ ఆపలేక బోర్లా పడిన లంక బౌలర్లు - శ్రీలంక మిస్ ఫీల్డింగ్
ప్రపంచకప్లో కార్డిఫ్ వేదికగా శ్రీలంక-అఫ్గానిస్థాన్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్లో లంక బౌలర్ల ఫీల్డింగ్ వీడియో నెట్టింట వైరల్గా మారింది. 26వ ఓవర్లో లంక బౌలర్ ప్రదీప్ వేసిన బంతిని... అఫ్గాన్ ఆటగాడు దౌలత్ హిట్ చేయగానే దాన్ని అందుకునే ప్రయత్నంలో తొలుత బౌలర్ విఫలం కాగా.. తర్వాత దాన్ని అడ్డుకోలేక మరో ఇద్దరు బోల్తా పడ్డారు. చివరికి ఆ బంతి బౌండరీ చేరింది. మ్యాచ్లో 34 పరుగులతో శ్రీలంక విజయం సాధించింది.