మహిళ పరువు కాపాడిన ప్రత్యర్థి జట్టు క్రీడాకారిణులు - woman shield her hairline from spectators
జోర్డాన్ వేదికగా అమాన్ ఆర్థోడాక్స్ , షాబాబ్ అల్-ఓర్డన్ క్లబ్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది. బంతిని అందుకునే సమయంలో అమాన్ జట్టు క్రీడాకారిణి హిజాబ్(బుర్ఖా) ఊడిపోయింది. వెంటనే గమనించిన ప్రత్యర్థి జట్టు ప్లేయర్లందరూ వీక్షకులకు కనిపించకుండా ఆమెకు అడ్డుగోడలా నిల్చున్నారు. ఆమె బుర్ఖాను సర్దుకునేవరకు అలానే ఉన్నారు. దీని వల్ల 30 సెకన్లు ఆట నిలిచింది. ఆ సమయంలో బంతి కోసం ఎవరూ వెళ్లకుండా ఎక్కడివారక్కడే ఉండిపోయారు. క్రీడాకారిణుల తీరుకు మైదానంలో చప్పట్ల మోత మోగగా.. నెట్టింట విపరీతంగా ప్రశంసలు అందుతున్నాయి.