కత్తిసాములో పిల్లాడిని ఓడించిన థామస్ బాచ్!
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ జపాన్లో పర్యటించారు. విశ్వ క్రీడలకు సరిగ్గా ఏడాది ఉన్న తరుణంలో టోక్యోలో క్రీడా విభాగాలను పరిశీలించారు. స్వతహాగా ఫెన్సింగ్(కత్తిసాము) క్రీడాకారుడైన థామస్ బాచ్ అక్కడ పిల్లలతో కలిసి కత్తి తిప్పాడు. ఈ పోటీలో థామసే పైచేయి సాధించారు. 1976 ఒలింపిక్స్లో ఫెన్సింగ్ విభాగంలో బాచ్ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నారు.