ఆరేళ్ల లిటిల్ కోచ్‌కు కోపమొస్తే...? - ఆరేళ్ల లిటిల్ కోచ్‌కు కోపమొస్తే...?
వేసవి కాలంలో విద్యార్థుల కోసం మిచిగాన్‌లో ఓ బేస్‌బాల్ టోర్నీ జరుగుతుంది. దాన్ని నార్త్ఉడ్ లీగ్ పేరుతో పిలుస్తారు. ఇందులో ఆడుతున్న కాలామజు గ్లోలర్స్ జట్టులో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. అతడే ఆరేళ్ల అసిస్టెంట్ కోచ్ 'డ్రేక్'. ఈ లిటిల్ కోచ్ పెద్ద ఆటగాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. అందుకే ఇతడొక సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. ఇదే టోర్నీలో భాగంగా అంపైర్ తన జట్టు ఆటగాడిని ఔట్‌గా ప్రకటించడాన్ని స్వీకరించలేకపోయిన డ్రేక్... బ్యాట్లు, బంతులు మైదానంలో పడేశాడు. అందరూ చూస్తుండగా క్యాప్ నేలకేసి కొట్టి తన అసహనాన్ని ప్రదర్శించాడు.