ప్రపంచ టైటిల్ గెలవగలిగే ధైర్యం వచ్చిందప్పుడే:హంపి - koneru hampi chess
తెలుగమ్మాయి, చదరంగ ధ్రువతార కోనేరు హంపి ఇటీవల ప్రపంచ వేదికపై సత్తా చాటింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ చెస్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. తొలిసారి ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్లేఆఫ్స్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ లీ టింగ్‌జీని ఓడించి టైటిల్ అందుకుంది. ఈ ఏడాది ఫిడె మహిళల గ్రాండ్‌ప్రిలో స్వర్ణం సాధించిన హంపి తొలి ప్రపంచ టైటిల్ ఖాతాలో వేసుకుంది. భారత్ తరఫున మహిళల విభాగంలోనూ ఇదే తొలి ప్రపంచ టైటిల్ కావడం విశేషం. తాజాగా తన ప్రదర్శనపై ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో ముచ్చటించింది.
Last Updated : Mar 15, 2020, 7:39 AM IST