వంద మీటర్ల పరుగులో అథ్లెట్లతో పాటు పిల్లి - balkan u20 men's athletics championship news
టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన బాల్కన్ అండర్-20 పురుషుల అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోని వంద మీటర్ల పరుగులో ఓ పిల్లి అడ్డుగా వచ్చింది. ఈ రేసు ముగింపు రేఖ వద్ద అథ్లెట్లు సమీపిస్తున్న సమయంలో వారికి కాళ్లకు అడ్డంగా దూసుకువెళ్లింది. అథ్లెట్లు పరుగు తీస్తూ పిల్లిని భయభ్రాంతులకు గురిచేయడం వల్ల అది అక్కడ నుంచి పారిపోయింది. ఈ వంద మీటర్ల పరుగులో టర్కీకి చెందిన అథ్లెట్ ఉముత్ ఉయ్సాల్ గెలుచుకున్నాడు.