సెరెనా జోరును పోల్ ఆపలేకపోయింది..!
టెన్నిస్ మాజీ ప్రపంచ నెంబర్-1 సెరెనా విలియమ్స్ దూకుడుగా ఆడుతుందన్న విషయం తెలిసిందే. 37 ఏళ్ల వయసులోనూ కోర్టులో యువ ఆటగాళ్లతో సమానంగా కదులుతుంది. ప్రస్తుతం జరుగుతోన్న రోజర్స్ కప్‌లో ఈ స్టార్ ప్లేయర్... టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. శుక్రవారం నయోమి ఒసాకా (జపాన్)తో క్వార్టర్స్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి స్మాష్‌ను అంచనా వేయలేకపోయిన సెరెనా పోల్‌ను ఢీకొంది. కొంత సేపు ఇబ్బందిపడినా తర్వాత మళ్లీ బ్యాట్‌పట్టి... 6-3, 6-4 తేడాతో సునాయసంగా నయోమిపై గెలిచింది.నేడు జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో బియాంక (కెనడా)తో టైటిల్ కోసం తలపడనుంది.
Last Updated : Sep 26, 2019, 3:16 PM IST