భౌతిక దూరంతో జాతీయ గీతాలాపన చూసేయండి! - Salzburg win Austrian Cup FInal latest news
కరోనా నేపథ్యంలో జరిగిన ఆస్ట్రియన్ కప్ ఫైనల్లో సాల్బర్గ్, ఆస్ట్రియా లస్టేనా జట్లు తలపడ్డాయి. ఇందులో సాల్బర్గ్ 5-0 తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భౌతిక దూరం నిబంధనలు పాటించారు ఆటగాళ్లు. మ్యాచ్ మొదలయ్యే ముందు జాతీయ గీతాన్ని దూరంగానే నిల్చుని పాడారు. టైటిల్ గెలిచిన ఆటగాళ్లు ఒకరిని మరొకరు తాకకుండా సంబరాలు చేసుకున్నారు. ఈ మ్యాచ్ను అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియంలో నిర్వహించారు. ఇప్పటివరకు ఈ టోర్నీ 9 సీజన్లు జరగ్గా.. 7సార్లు టైటిల్ గెలిచింది సాల్బర్గ్.
Last Updated : May 30, 2020, 8:25 PM IST
TAGGED:
Austrian Cup FInal news