హడలెత్తించిన పాము... అవలీలగా పట్టేసిన మహిళ - karimnagar district news
కరీంనగర్ పట్టణంలోని కొన్ని కాలనీల్లో పాములు బెంబేలెత్తిస్తున్నాయి. కోతి రాంపూర్‌లో ఓ ఇంట్లోకి పాము చొరబడింది. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. స్థానికంగా పాములు పట్టే ఓ మహిళకు సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న సదరు మహిళ.. పామును చాకచక్యంగా బంధించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పాము సుమారు రెండు మీటర్ల పొడవు ఉండడంతో భయపడినట్లు స్థానికులు చెప్పారు. చిన్నపిల్లలు ఆడుకొనే స్థలంలో రోజు పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST