ఆకర్ష్, రూపలపై నిఘా పెట్టిన వజ్రావతి! - యమలీల.. ఆ తర్వాత కొత్త ఎపిసోడ్
ఆలీ హీరోగా వచ్చిన 'యమలీల'కు కొనసాగింపుగా తెరకెక్కుతోన్న సీరియల్ 'యమలీల.. ఆ తర్వాత'. రోజురోజుకూ ఎంతో ఆసక్తిగా మారుతోన్న ఈ ధారావాహిక ఈటీవీలో ప్రతిరోజూ రాత్రి 8 గంటలకు ప్రసారమవుతోంది. రమణ నుంచి చిన్న, రజనీ తప్పించుకోగా.. పట్నం వచ్చిన రమణపై కేసు పెట్టడానికి సిద్ధమయ్యారు ఆకర్ష్, అనిరుధ్. అలాగే చిన్నికి సాయంగా ఉన్న ఆకర్ష్, రూపల గురించి తెలుసుకోమని ఇన్స్పెక్టర్కు చెబుతుంది వజ్రావతి.