సమాజం గురించి రౌడీ హీరో పాఠాలు - dear comrade
డియర్ కామ్రేడ్ ప్రచారంలో భాగంగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న విజయ్ దేవరకొండ.. చిన్నప్పటి నుంచే సమాజం ఏ విధంగా మారుస్తుందో చెప్పాడు. స్కూల్లో యూనిఫాం ధరించాలనే నియమం నుంచి... ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే విషయాల్లో పిల్లలకు స్వేచ్ఛ ఉండదన్నాడు. అనుభవం రీత్యా, నేర్చుకొనే విధానం ఆధారంగా అన్నీ మార్పు చెందుతాయని.. విజయాలు వ్యక్తిని మానసికంగా మరింత దృఢంగా మారుస్తాయని అభిప్రాయపడ్డాడు.