పిల్లల భవిత కోసం దిగివచ్చిన తారాలోకం - హైదరాబాద్ పార్క్ హోటల్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల జీవన ప్రమాణాన్ని మెరుగుపర్చేందుకు తారాలోకం దిగివచ్చింది. హైదరాబాద్లో టీచ్ ఫర్ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి టాలీవుడ్ యువనటులు హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేస్తూ తమ మద్దతు తెలిపారు. సంస్థ ద్వారా వచ్చిన నిధులతో హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాయం చేయనున్నారు.