భాగ్యనగరంలో.. టాలీవుడ్ ముద్దుగుమ్మల సందడి - Tollywood stars in mugdha art studio inauguration
టాలీవుడ్ ముద్దుగుమ్మలు రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరణ్, గాయని సునీత భాగ్యనగరంలో సందడి చేశారు. ప్రముఖ వస్త్ర బ్రాండ్ ముగ్దా ఆర్ట్ స్డూడియో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో సరికొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ ముగ్గురు అతివలు అందమైన పట్టు చీరల్లో తళుక్కున మెరిశారు. తమ ఫేవరేట్ తారలను చూసేందుకు అభిమానులు ప్యాట్నీ సెంటర్‌కు భారీగా తరలివచ్చారు.