'కరోనా వెళ్లినా టాలీవుడ్లో ఆ భయం ఉంటుంది' - tollywood producer suresh babu about corona pandemic on cinema industry
ఈటీవీ భారత్‌తో జరిగిన లైవ్ చాట్ సెషన్లో మాట్లాడిన నిర్మాత సురేశ్‌బాబు.. కరోనా ప్రభావం టాలీవుడ్‌పై ఎలా ఉండనుంది? అనే అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. లాక్డౌన్ తాత్కాలికంగా ఎత్తేసినా సరే షూటింగ్‌లు జరగడం, థియేటర్లు తెరవడం కష్టమని చెప్పారు. ఈ వైరస్ పూర్తిగా అంతమైన తర్వాత.. సినీ పరిశ్రమలోని వ్యక్తులకు మరింత జాగ్రత్తగా ఉండాలనే భయం ఉంటుందని తెలిపారు.