'ప్రధాని మోదీ చెప్పినట్లు ఇది ఈవెంట్ కాదు మూమెంట్' - tollywood news
భారతీయుల్లో ఒక్కడిని అయినందుకు గర్వపడుతున్నానని చెప్పాడు నటుడు సాయి కుమార్. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూ పాటించామని, లాక్డౌన్ అంటే లాక్ అయ్యామని, చప్పట్లు కొట్టామని, దీపాలు వెలిగించామని.. అయితే ఇది ఈవెంట్ కాదు మూమెంట్ అని అన్నాడు. మనం ఇదంతా చేస్తున్నది మోదీ కోసం కాదని, మనకోసమని తెలిపాడు. ఈ వైరస్ ప్రభావం తగ్గేవరకూ అందరూ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.