మా నాన్నకు మీ ఆశీస్సులు కావాలి: శివ శంకర్ తనయుడు - చిరంజీవి
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు అజయ్ శివశంకర్ మాట్లాడారు. ఏఐజీ ఆస్పత్రిలో మాస్టర్‌కు వైద్యం కొనసాగుతోందని చెప్పారు. కరోనా కారణంగా తండ్రి శివశంకర్‌తో పాటు తన అన్న కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, తల్లి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. వారం రోజుల్లో ఇంట్లో ముగ్గురికి కరోనా సోకడం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్లినట్లు చెప్పారు అజయ్. అయితే మెగాస్టార్ చిరంజీవి, సోనూసూద్, డాన్స్ మాస్టర్లు లారెన్స్, జానీ సహా ఇతరులు తమకు అండగా ఉన్నట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు.
Last Updated : Nov 26, 2021, 4:34 PM IST