'బ్రహ్మాజీ కొడుకని హీరోయిజం చూపించాడు' - nithya shetty news
బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్, మరో హీరో విశ్వంత్ పై 'ఓ పిట్ట కథ' హీరోయిన్ నిత్యా శెట్టి తన మనసులోని మాటలను బయటపెట్టింది. సినిమా చిత్రీకరణకు ముందు తనతో పెద్దగా మాట్లాడేవాళ్లు కాదని, హీరోయిజం చూపించేవాళ్లని అభిప్రాయపడినట్లు చెప్పింది. సినిమా పూర్తయ్యేసరికి సంజయ్, విశ్వంత్ మంచి స్నేహితులయ్యారని ఆనందం వ్యక్తం చేసింది. పిట్టకథలో వెంకటలక్ష్మి పాత్రలో కనిపించనుంది అమ్మడు. పిట్ట కథంతా తనచుట్టే తిరగడం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందంటోన్న నిత్యా... ఆ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలను ఈటీవీ భారత్ తో పంచుకుంది.