చిత్రవిచిత్ర దుస్తులు.. వేదికపై హొయలు - serena willioms
🎬 Watch Now: Feature Video
ప్రముఖ అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ మెట్ గాలా ఈవెంట్లో పాల్గొంది. పసుపు రంగు దుస్తుల్లో పింక్ కార్పెట్‌పై నడిచింది. ఆమెతో పాటు పలువురు మోడళ్లు ఈ వేదికపై సందడి చేశారు. విభిన్న రకాల దుస్తులతో మోడల్స్ పింక్ కార్పెట్‌పై హొయలొలికించారు. భారీ గౌన్లతో కొందరు ఆకట్టుకోగా.. సీతాకోక చిలుక డ్రెస్సులో, పురుషులు లేడీ గెటప్ల్లో అలరించారు. నో ఫొటోస్ ప్లీజ్ అంటూ మరికొందరు డ్రెస్సులపై సందేశాన్ని రాసుకొచ్చారు. తలపై విభిన్న రకాల టోపీలతో దర్శనమిచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు